శంషాబాద్:రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో కరోనాపై కో-ఆర్డినేషన్ మీటింగ్
- March 16, 2020
సైబరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ (ట్రాన్స్పోర్ట్, రోడ్స్ & బిల్డింగ్స్) సునీల్ శర్మా, ఐఏఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్., ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అనూరాధ, జిఎంఆర్ స్టాఫ్, సిఐఎస్ఎఫ్, కస్టమ్స్, జిహెచ్ఏఐఎల్, టిఎస్ఆర్టిసి, మెడికల్, వివిధ ఎయిర్వేస్ సర్వీసెస్ మేనేజర్ల కరోనా వైరస్ కు సంబంధించి ఎయిర్ పోర్ట్ లో తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై ఎయిర్ పోర్టులోని ఇన్సిడెంట్ మేనేజ్ మెంట్ సెంటర్ లో కో-ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ (ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ & బిల్డింగ్స్) సునీల్ శర్మా, ఐఏఎస్., వివిధ శాఖల అధికారులతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చర్చించి తగు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంగా, సమష్టిగా పని చేయాలన్నారు.
అనంతరం సైబరాబాద్ సిపి వీసీ సజ్జనార్, ఐపీఎస్., మాట్లాడుతూ విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులను అన్ని విధాలుగా థర్మల్ ఇమేజింగ్ ఎక్విప్మెంట్ ద్వారా స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు.
కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణకు Personal Protective Equipment (PPE) కిట్ ద్వారా వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. PPE కిట్ లో మస్కూలు, డ్రస్, గ్లోవ్స్, హెడ్ గార్, గాగుల్స్, షూస్ తదితర సామగ్రి ఉంటాయన్నారు. కరోనా వైరస్ ఉందనే అనుమానం ఉంటే quarantine లో ఉంచి నమూనాలను పుణే కు పంపించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.
కరోనా వ్యాధి ఉందని అనుమానిస్తున్న దేశాలైన చైనా, ఇరాన్, సౌత్ కొరియా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నుంచి వచ్చే వారిని 14 రోజులపాటు Quarantine చేస్తున్నామన్నారు. అయితే ఆయా దేశాల నుంచి హైదరాబాద్ కు నేరుగా ఫ్లైట్లు లేవని, కనెక్టింగ్ ఫ్లైట్ ల ద్వారా హైదరాబాద్ కు వస్తున్నారని తెలిపారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మొత్తం 200 మంది డాక్టర్లు మూడు విభాగాలుగా పని చేస్తున్నారన్నారు. మెడికల్ స్టాఫ్ మరియు అంబులెన్స్ లు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే 200 మంది పోలీస్ సిబ్బంది 24 X 7 పని చేస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వరకు స్కూళ్లు, థియేటర్లు, ఫంక్షన్ హాల్లు మార్చి 31 మూసివేయాలని జీఓ జారీ చేసిందన్నారు.
సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్ ఉందని, ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఆందోళన సృష్టించే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్- 2005 ప్రకారం చట్ట ప్రకారం ఒక సంవత్సరం పాటు శిక్షార్హులు అవుతారు. అలాగే ఫేస్ మాస్క్ లు, శానిటైజర్స్లను MRP ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం శిక్షార్హులు అవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ (Transport, Roads and Buildings), సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., సంతోష్, ఐఏఎస్., శంషాబాద్ డిసిపి ఎన్ ప్రకాష్ రెడ్డి, ఐపీఎస్.,సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ అనూరాధ, సిఐఎస్ఎఫ్ డిసి రవీందర్, జిఎంఆర్ సీఎస్ఓ భరత్ కమ్దార్, శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఎయిర్ పోర్ట్, హెల్త్ ఆర్గనైజేషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇండిగో, ఒమన్ ఎయిర్, ఎయిర్ ఇండియా, విస్తారా, ఖతార్ తదితర ఎయిర్వేస్ సర్వీస్ మేనేజర్లు, సీఐఎస్ఎఫ్, కస్టమ్స్, జిహెచ్ఐఏఎల్, అపోలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?