విదేశాల్లో ఉన్న ఎమిరాతీస్ వెంటనే తిరిగి రావాలని కోరిన యూఏఈ
- March 17, 2020
కరోనా ఎఫెక్ట్ తో పలు దేశాలు ఫ్లైట్స్ సర్వీసులను నిలిపివేస్తున్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే తిరిగి రావాలని యూఏఈ కోరింది. విదేశీ పర్యటనలో ఉన్నా, చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారి కోసం విదేశాంగ శాఖ ఈ సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో ఫ్లైట్ ప్రయాణాలపై మరింత రిస్ట్రిక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్ధులు అనారోగ్యం బారిన పడితే యూఏఈ ఎంబసీ ద్వారా స్కాలర్ షిప్ ఎజెన్సీలను సంప్రదించాలని కూడా సూచించింది. అలాగే విదేశాల్లో ఉన్న వారి అక్కడి మిషన్స్ ను సంప్రదించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవటం తప్పనిసరి అని అన్నారు.
ఇదిలాఉంటే పలు దేశాలు జాతీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఫ్లై దుబాయ్ సర్వీసులను నిలిపివేశారు. మార్చి 31 వరకు బహ్రెయిన్, సౌదీ అరేబియాకు వెళ్లే ఫ్లైట్స్ ను రద్దు చేశారు. అలాగే మార్చి 14 నుంచి 19 కువైట్ ఫ్లైట్స్, మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఇండియా వెళ్లే సర్వీసులను కూడా నిలిపివేశారు. ఇరాన్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్, టర్కీ, సుడాన్ వెళ్లే ఫ్లైట్ సర్వీసులను కూడా రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు పునరుద్దరిస్తారో కూడా నిర్ణయించలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?