కరోనా వైరస్ కంటే పుకార్లే ప్రమాదకరం
- March 18, 2020
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కరోనా వైరస్ పట్ల జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించింది. పుకార్లు, కరోనా వైరస్ కంటే ప్రమాదకరమని పేర్కొంది. కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామనీ, అనవసర భయాలకు ప్రజలు లోను కావాల్సిన అవసరం లేదనీ, ఎప్పటికప్పుడు కరోనా వైరస్‌కి సంబంధించిన అధికారిక సమాచారం విడుదల చేస్తున్నామని మినిస్ట్రీ అధికార ప్రతినిది¸ డాక్టర్ మొహమ్మద్ అబ్దెల్ అలి చెప్పారు. మినిస్ట్రీని సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని ప్రజలకు సూచించారాయన. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దనీ, అధికారికంగా కరోనా వైరస్‌పై ఆడియో, వీడియో ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పారాయన. ఎక్కువ మంది ప్రజలు గుమి గూడటం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతుందనీ, వ్యాధి అనుమానితులు ఇంటి వద్దనే వుండడం ద్వారా వ్యాప్తిని నిరోదించవచ్చుననీ చెప్పారు. మొత్తం 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరి పరిస్థితి మాత్రమే ఆందోళనకరంగా వుందని వివరించారు. సుమారు 700,000 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







