తెలంగాణలో మరో కరోనా కేసు
- March 18, 2020
తెలంగాణలో మరో కరోనా వైరస్ కేసు నమోదయింది. తెలంగాణలో ఇప్పటికే ఐదుగురికి కరోనా సోకిన విషయం తెలిసిందే. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా పాజిటివ్ అని తేలిన వారి సంఖ్య ఆరుకి తేలింది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే ఒకరికి గాంధీ ఆసుపత్రి వైద్యులు నయం చేసి డిశ్చార్జ్ చేశారు. విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనపడితే వెంటనే ఐసోలేషన్ వార్డులు తరలించి, నమూనాలను పూణెకు పంపుతున్నారు. కరోనా సోకిందని తేలితే వారికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?