2 మిలియన్ల మాస్క్‌లు, గ్లోవ్స్‌ సీజ్‌

- March 19, 2020 , by Maagulf
2 మిలియన్ల మాస్క్‌లు, గ్లోవ్స్‌ సీజ్‌

రియాద్‌:2 మిలియన్లకు పైగా మాస్క్‌లు, గ్లోవ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ ఈ మేరకు సోదాలు నిర్వహించి, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సౌదీ ఫుడ్‌ మరియు డ్రగ్స్‌ అథారిటీ (ఎస్‌ఎఫ్‌డిఎ), ఓ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌పై జరిపిన సోదాల్లో ఈ గూడ్స్‌ వెలుగు చూశాయి. వీటిని అధిక ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. సదరు కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి సరైన లైసెన్స్‌ లేదనీ అధికారులు తెలిపారు. ఈ తరహా అత్యవస వస్తువుల్ని అక్రమంగా ఇంపోర్ట్‌ చేస్తే కఠిన చర్యలు వుంటాయని అధికారులు హెచ్చరించారు. పౌరులెవరైనా ఇలాంటి అక్రమాలు తమ దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికార వర్గాలకు తెలియజేయాలని మినిస్ట్రీ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com