మలేషియా లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించండి:ఎంవీవీ
- March 20, 2020
తెలంగాణ రాష్ట్రాల తో పాటు పంజాబ్,కర్ణాటక ,తమిళనాడు తక్కిన రాష్ట్రాలకు చెందిన సుమారు 41 మందిని తిరిగి స్వదేశానికి తిరిగి రప్పించాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీ లో ఆయన కార్యాలయానికి లేఖ రాశారు.ఈ సంధర్భంగా ఎంవీవీ మాట్లాడుతూ మలేషియా లో చిక్కుకున్న ఆ 41 మందిని స్వస్థలాలకు రప్పించాలని ఆ లేఖ లో కోరామన్నారు. ఈ మేరకు ఓ విజ్ఞాపన పత్రాన్ని జై శంకర్ కు పంపామన్నారు. కరోన వైరస్ (కోవిడ్-19) ప్రస్తుతం విజృంభిస్తున్న తరుణంలో ఆయా రాష్ట్రాల కు చెందిన 41 మంది అక్కడ చిక్కుకున్నారని. ఈ నేపధ్యంలో వారి తల్లి తండ్రులు ,కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. భాదితుల తల్లితండ్రులు తనను కలిసి , ఈ విషయం పై ఆవేదన వెలిబుచ్చి, తగు న్యాయంచేయాలని కోరారన్నారు. ఈ క్రమంలో మలేషియా నగర ఎయిర్పోర్టు లో సహాయార్ద్ధులై వేచి ఉన్న వారిని , తిరిగి రప్పించేందుకు చొరవచూపాలని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రికి లిఖిత పూర్వకంగా విన్నవించామన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు