30 రోజుల పాటు 'ఏసీకే', 'టింకిల్' యాప్స్ ఉచిత యాక్సెస్ ఆఫర్ చేసిన రానా
- March 20, 2020
కరోనా వైరస్ మీద నెలకొన్న భయాందోళనల కారణంగా సినిమా సహా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ మొత్తం కార్యకలాపాల్ని నిలిపి వేయడంతో, ప్రజలు ఇళ్లల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అనేకమంది సెలబ్రిటీలు కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తన 'అరణ్య' చిత్రం విడుదలను వాయిదా వేసిన హ్యాండ్‌సమ్ హీరో రానా దగ్గుబాటి, సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక చక్కని కానుకను ఆఫర్ చేశారు. ఒక నెల రోజుల పాటు ఏసీకే (అమర్ చిత్ర కథ), టింకిల్ యాప్స్‌లోని కంటెంట్‌ను ఉచితంగా తిలకించవచ్చని ప్రకటించారు. ఆ రెండు యాప్స్ ఆయనవే.
"ఏసీకే విషయంలో ఈ నెలలో ఆన్‌లైన్ సభ్యత్వాలను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఏసీకే, టింకిల్ యాప్స్‌లోని అద్భుతమైన కంటెంట్‌ను పిల్లలు, పెద్దలు కూడా ఉచితంగా చూసుకోవచ్చు. వాటిలో తమకు ఇష్టమైన దాన్ని చదువుకోవచ్చు. అందులోనివన్నీ మన ప్రాంతం కథలు. అవి చదివితే మన దేశం, మన దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చక్కని బొమ్మలు, కథలతో అవి అలరిస్తాయి. మన గతం గురించి తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడానికి నేటి తరానికి ఇది చాలా ముఖ్యం" అని రానా చెప్పారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...