సినీ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్
- March 20, 2020
సినీ గాయని కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గత ఆదివారం బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సందర్భంగా ఆమె లక్నోలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో పార్టీ ఇచ్చారు. దీనికి ప్రముఖ రాజకీయ నేతలతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా హాజరయ్యారు. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన విషయాన్ని ఆమె గోప్యంగా ఉంచారు. ఇప్పుడు తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని స్వయంగా ఆమే ప్రకటించారు.
''గత నాలుగు రోజుల నుంచి నాలో ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా. అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు నేను, నా కుటుంబ సభ్యులం క్వారంటైన్‌లో ఉన్నాం. నేనెవరిని కలిశానో ఆ వివరాలను కూడా అందిస్తా. విదేశాల నుంచి తిరిగి వచ్చిన సమయంలో విమానాశ్రయంలో చేయాల్సిన పరీక్షలన్నీ చేశారు. కానీ నాలుగు రోజుల క్రితమే కరోనా లక్షణాలు బయటపడ్డాయి.'' అని ప్రకటించారు. ఇక, సింగర్ కనికా కపూర్ ఇచ్చిన విందుకు దాదాపు నాలుగు వందల మంది హాజరైనట్లు సమాచారం.
మరోవైపు ఈ పార్టీకి హాజరైన రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి హాజరైన తర్వాత దుష్యంత్ పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ఇద్దరు ఎంపీలతో చర్చించడమే కాకుండా దాదపు రెండున్నర గంటల పాటు పార్లమెంటు సెంట్రల్ హాలులో కలియ తిరిగారు కూడా.
ఎప్పుడైతే సింగర్ కనికా కపూర్‌కు పాజిటివ్ అని తేలడంతో వెంటనే వసుంధర రాజే సింధియా, ఆమె కుమారుడు దుష్యంత్ స్వయంగా క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయినట్లు ప్రకటించారు. ఇక, యూపీ ఆరోగ్య శాఖా మంత్రి జయప్రతాప్ సింగ్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. సింగర్‌కు పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...