కరోనా ఎఫెక్ట్:బహిరంగ ప్రదేశాల్లో భారీగా స్టెరిలైజేషన్ ప్రారంభించిన దుబాయ్
- March 21, 2020
దుబాయ్:ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ మున్సిపాలిటీ మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు నిర్బంధ విధానాన్ని అమలు చేస్తూనే..భారీ స్టెరిలైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కరోనా వైరస్ బహిరంగ ప్రదేశాల్లో 12 గంటల పాటు యాక్టీవ్ గా ఉండగలదు. దీంతో శనివారం నుంచి 11 రోజుల భారీ స్టెరిలైజేషన్ క్యాంపేన్ చేపట్టింది. ఇందులో భాగంగా దుబాయ్ మున్సిపాలిటీ పరిధిలోని 95 రోడ్లపై పెద్ద మొత్తంలో శానిటైజర్స్ స్ప్రే చేస్తూ శుభ్ర పరుస్తున్నారు. ప్రధాన రోడ్ల నుంచి గల్లీ రోడ్ల వరకు ప్రతీ చోట స్టేరిలైజేషన్ చేయనున్నారు. అటు ప్రజలు కూడా డిస్ ఇన్ఫెక్షన్ చర్యలకు సహకరించాలని దుబాయ్ మున్సిపాలిటీ కోరింది.
తాజా వార్తలు
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్‌పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!







