దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారత ప్రయాణీకుల కోసం హెల్ప్‌లైన్‌

- March 21, 2020 , by Maagulf
దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారత ప్రయాణీకుల కోసం హెల్ప్‌లైన్‌

దుబాయ్‌లో ఇండియా కాన్సులేట్‌ జనరల్‌, అత్యవసర హాట్‌లైన్‌ నెంబర్‌ని, దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేసింది. కాన్సులేట్‌ జనరల్‌ ప్రకటించిన హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 0097156 546 3093ని సంప్రదించాలని ఈ సందర్భంగా భారత ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం, రెండు వారాల పాటు ఓవర్సీస్‌లో ప్రస్తుతం వున్న వ్యాలీడ్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌ హోల్డర్స్‌పై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాలీడ్‌ రెసిడెన్స్‌ పర్మిట్‌ వున్నవారు, వారి కుటుంబ సభ్యులు, ఫస్ట్‌ డిగ్రీ రిలేటివ్స్‌ కూడా ఈ హెల్ప్‌లైన్‌ని సంప్రదించవచ్చు. రెసిడెంట్స్‌ కోసం 0097192083344 అనే నెంబర్‌ని కూడా ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com