అబుధాబి:ట్రాఫిక్ జరిమానాపై 50% తగ్గింపు గడువు మరో 3 నెలలు పెంపు
- March 21, 2020
అబుధాబి:ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు గడువును మరో మూడు నెలలు పొడగించినట్లు అబుధాబి అధికారులు వెల్లడించారు. వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఫైన్లను క్లియర్ చేసుకునేందుకు గత ఏడాది తొలిసారిగా తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. డిసెంబర్ 22కు ముందు విధించిన ట్రాఫిక్ చలాన్లకు తగ్గింపు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన డెడ్ లైన్ ప్రకారం జరిమానాల చెల్లింపు గడువు ఈ నెల 22తో ముగిస్తుంది. తగ్గింపు తో పాటు పెనాల్టీ పాయింట్స్ మినహాయింపు, వాహన ఇంపౌడ్ నిబంధనలను కూడా సడలించింది. అంతేకాదు 50% తగ్గింపు కు అర్హులు కాని వారి కోసం ఎర్లీ పేమెంట్ ఇన్సెంటీవ్ ఆఫర్ కూడా ప్రకటించింది. 60 రోజుల్లోగా ఫైన్ చెల్లిస్తే 35% తగ్గింపు, 60 రోజుల తర్వాత చెల్లిస్తే 25% తగ్గింపు వర్తించనుంది. అయితే..సీరియస్ వయోలేషన్ కు పాల్పడని వాహనదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని కూడా గతంలోనే క్లారిటీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే..వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా తగ్గింపు గడువును జూన్ 22 వరకు పొడగించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?