హైదరాబాద్:తెలంగాణలో తొలి కంటాక్ట్ కరోనా కేసు నమోదు..భయాందోళనలో ప్రజలు
- March 21, 2020
తెలంగాణలో రోజులు గడుస్తున్న కొద్ది కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఒకటి రెండు కేసుల నుంచి ఏకంగా 21 మందికి కరోనా వైరస్ సోకింది. అంతేకాదు తెలంగాణలో తొలి కాంటాక్ట్ కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 35 ఏళ్ల హైదరాబాద్ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలంగాణ వ్యక్తికి కరోనా సోకినట్లు ప్రకటించింది. ఈ నెల 14న దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉన్నా అతను మాత్రం పట్టించుకోలేదు. 17 వరకు అతను జనం మధ్యనే ఉన్నాడు. 17న కరోనా లక్షణాలు కనిపించటంతో ఆస్పత్రిలో చేరగా..19న కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. అయితే..స్నేహంగా మెలిగిన 35 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు కనిపించటంతో నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కూడా పాజిటీవ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఇదే తొలి కాంటాక్ట్ కరోనా కేసు. దీంతో వైరస్ విస్తృతి చెందుతుందనే అనుమానం వైద్యులకు ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?