మనామ : కరోనాపై పోరాటానికి పేర్లు నమోదు చేసుకున్న 30,000 వాలంటీర్లు
- March 22, 2020
కరోనా వైరస్ పై పోరాడేందుకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ తమతో కలిసి పని చేయటానికి 30 వేల మంది వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించింది. వాలంటీర్ల పేర్ల నమోదు ఈ నెల 15 నుంచి చేపట్టామని..ఈ వారం రోజుల్లోనే దాదాపు 30 వేల మంది కరోనాపై పోరాటానికి ముందుకు రావటం సంతోషించదగ్గ పరిణామం అని పేర్కొంది. ఇందులో మొదటగా సంప్రదించిన వారు మెడికల్ నేపథ్యం ఉన్న వారు, ఫీల్డ్ వర్క్, హెల్త్ సర్వీసులు అందించిన నేపథ్యం ఉన్నవాళ్లే కావటం విశేషం. కరోనాపై చిత్తశుద్ధితో సేవలు అందించాల్సిన ప్రస్తుత తరుణంలో ఇంతమంది బాధ్యతగల పౌరులు తమ సామాజిక బాధ్యతగా సంఘీభావం చాటుకున్నారని టాస్క్ ఫోర్స్ నిర్వాహకులు ప్రశంసించారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









