చప్పట్లు, అభినందనలతో మార్మోగిన భారత్

- March 22, 2020 , by Maagulf
చప్పట్లు, అభినందనలతో మార్మోగిన భారత్

న్యూఢిల్లీ: కరోనావైరస్ అప్‌డేట్: దేశమంతటా చప్పట్ల మోత... వైరస్‌తో పోరాడుతున్న వారికి వందనాలు..

ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటి వచ్చి చప్పట్లు కొట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశం మొత్తం ఏకమైంది. అత్యవసర సేవలు, ఆరోగ్య సిబ్బంది సేవలను కొనియాడుతూ... వారికి మరింత ఉత్సాహం కలిగించేలా సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా ఇళ్ల బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ కృతజ్ఞత చాటుకున్నారు. కరతాళ ధ్వనులతో మాత్రమే కాదు... చిన్నా పెద్దా తేడా లేకుండా ఇళ్ల పైకి ఎక్కి ప్లేట్లు, డ్రమ్స్, గిటార్లు వాయిస్తూ సంఘీభావం తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, బాబా రాందేవ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు గంటను వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మరికొందరు బయటికి వచ్చి శానిటైజర్లు, మాస్క్‌లు పంచిపెడుతూ తమ దాతృత్వం చాటుకున్నారు. కాగా ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలతో మాట్లాడుతూ..''మన ఆరోగ్యం కోసం తమ ప్రాణాలు లెక్కచేయక పనిచేస్తున్న ఆ సిబ్బంది అందరినీ ఉత్సాహపరుస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశమంతా ప్రజలు ఇళ్ల గుమ్మాల్లో, బాల్కనీల్లో నిలుచుని సంఘీభావం తెలిపాలి'' అని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

పలువురు ప్రముఖులు సైతం తమ అభిమానాన్ని తెలిపారు..

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com