క్రొయేషియా: ఓ వైపు కరోనా..మరో వైపు ప్రకృతి విజృంభణ..
- March 23, 2020


ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడ కనికరించడం లేదు. మొన్న గ్రీస్‌లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. క్రోయేషియా రాజధాని జాగ్రెబ్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటకే అక్కడ కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఆదివారం భూకంపం రావడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రిక్టార్ స్కెల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీం.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







