మార్చి 25 నుంచి విమానాల్ని రద్దు చేయనున్న ఎమిరేట్స్
- March 23, 2020
సుదూర ప్రాంతాలకు సైతం విమాన సర్వీసులు కలిగినటువంటి ఎమిరేట్స్, తమ ప్యాసింజర్ విమానాల్ని బుధవారం నుంచి రద్దు చేయనుంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది సంస్థ. దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్, ఈస్ట్ మరియు వెస్ట్‌ని కలపడంలో కీలక భూమిక పోషిస్తోంది విమాన ప్రయాణాల విభాగంలో. ఎమిరేట్స్ సీఈఓ మరియు ఛైర్మన్ అయిన షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూం మాట్లాడుతూ, ప్రపంచం మొత్తం కోవిడ్ 19 కారణంగా క్వారంటీన్‌లోకి వెళ్ళిపోయిందనీ, ఈ నేపథ్యంలో తమ సర్వీసులు కూడా మూసివేయక తప్పడంలేదని అన్నారు. వివిధ దేశాలు తమ బోర్డర్స్‌ని తెరిచేదాకా విమానాల్ని నడిపే పరిస్థితి లేదని ఎమిరేట్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







