పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేత

- March 24, 2020 , by Maagulf
పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేత

యూఏఈ: దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్ లోని అన్ని కేంద్రాలలో భారత పాస్పోర్ట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి. దుబాయ్ కాన్సులేట్ జనరల్ మంగళవారం దీనిని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఏప్రిల్ 7 వరకు సేవలను నిలిపివేస్తామని కాన్సులేట్ తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, పరిస్థితి వివరించే పత్రాలు జతకలిపి [email protected] కు ఇమెయిల్ పంపవచ్చని తెలిపారు. 24 గంటల్లో తమ మెయిల్ కు వచ్చిన ఫిర్యాదులపై కాన్సులేట్ అధికారులు స్పందిస్తారని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com