మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కేజ్రీవాల్ మైనపు విగ్రహాo
- January 24, 2016
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీల మైనపు విగ్రహా లను ఏర్పాటు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లం డన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మైనపు విగ్రహా న్ని ఏర్పాటు చేయనుంది. దీంతో భారత్‌లోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. కేజ్రివాల్ విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం మరో విశేష మవుతుంది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు భారతీయ పార్టనర్ అయిన విజ్‌క్రాఫ్ట్ ఎంటర్నేన్ మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ మేరకు కేజ్రివా ల్కు జనవరి 11వ తేదీన ఓ లేఖ రాసినట్లు తెలిసిం ది. ఫిబ్రవరి మొదటివారంలో విజ్‌క్రాఫ్ట్ ప్రతినిధు లు కేజ్రివాల్‌ను కలసి ప్రాజెక్టు గురించి చర్చించను న్నారు.వచ్చే ఏడాది నాటికల్లా ఢిల్లీలో ఆకర్షణీ యమైన మైనపు విగ్రహాల మ్యూజియంను ఏర్పా టు చేయాలన్నది విజ్‌క్రాఫ్ట్ లక్ష్యం. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోది గత నవంబర్ నెలలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఇరు దేశాల మధ్య సాంస్కతిక సంబంధాల అభివృద్ధి కోసం తాము ఢిల్లీలో వాక్య్ మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటు న్నట్లు టుస్సాడ్ మ్యూజియం వర్గాలు ప్రకటించా యి. ఆ మ్యూజియంలో ముందుగా కేజ్రీవాల్ మైన పు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తాజా నిర్ణ యం. అమెరికా, ఆసియా, ఆ్రస్టేలియాలతోపాటు యూరప్‌లోని మొత్తం 20 దేశాల్లో మైనపు విగ్రహా ల మ్యూజియంలను టుస్సాడ్స్ ఏర్పాటు చేసింది. ఆ మ్యూజియంలలో ఇప్పటికే జాతిపిత మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, మాధురి దీక్షిత్, హృతిక్ రోషణ్, సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఉన్నాయి
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







