యూ.ఏ.ఈ:వర్క్ పర్మిట్లు,రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి
- March 26, 2020
యూ.ఏ.ఈ:మానవ వనరులు & ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్షిప్, వర్క్ పర్మిట్ గడువు ముగిసిన కార్మికులకు వైద్య పరీక్షల మినహాయింపును ప్రకటించింది.
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి యూ.ఏ.ఈ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా కంపెనీలు,కార్మికుల వంటి సహాయక సేవా సిబ్బందికి పనిచేసే అనుమతులు మరియు రెసిడెన్స్ వీసాలు ఆటోమేటిక్ గా జారీ చేయబడతాయి మరియు పునరుద్ధరించబడతాయి.
కొత్త చర్యల ప్రకారం, కార్మికులు యూ.ఏ.ఈ దేశవ్యాప్తంగా వైద్య పరీక్షా కేంద్రాలకు వెళ్లవలసిన అవసరం లేదు.అటువంటి సేవలకు ఫీజులు అధీకృత చెల్లింపు మార్గాల ద్వారా సేకరించబడతాయి.ఫీజు చెల్లించిన తర్వాత, కార్మికులు యూ.ఏ.ఈ యొక్క చట్టబద్ధమైన నివాసితులుగా ఉంటారు.
ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజెన్షిప్ వ్యాపార యజమానులను తమ కార్మికులలో కోవిడ్ -19 యొక్క ఏదైనా అనుమానాస్పద కేసును నివేదించమని కోరింది. యూ.ఏ.ఈలోని కార్మికులందరూ తమ సొంత భద్రత కోసం మరియు సమాజ భద్రత కోసం ముందుజాగ్రత్త సూచనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?