సౌదీ-కువైట్ సరిహద్దులో చిక్కకుపోయిన జనం..
- March 26, 2020
కువైట్:గల్ఫ్ దేశాల్లో కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా వ్యాప్తిని నియంత్రించటంలో భాగంగా దేశ సరిహద్దులు మూసివేయటంతో కొందరు ప్రజలు బోర్డర్ దగ్గర చిక్కుకుపోయారు. కువైట్-సౌదీ సరిహద్దులోని జనంలో అలాంటి కష్టాలనే ఎదుర్కుంటున్నారు. డజన్ల కొద్ది కువైతీలు, వారి కుటుంబ సభ్యులు సరిహద్దు దగ్గర అనుమతి కోసం వేచి చూస్తున్నారు. తమను కువైట్ లోకి అనుమతించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే సౌదీ నుంచి వచ్చే సరిహద్దును కువైట్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే..అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో తమను కువైట్ కు తిరిగి వచ్చేందుకు తగినంత సమయం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు. తమను దేశంలోకి అనుమతించాలని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనస్ అల్ సలెహ్ కోరారు. తాము కుటుంబాలతో సహా సరిహద్దులో చిక్కుకుపోయామని..మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారని తమ ఆవేదను వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు