GoAir ఉద్యోగులకు షాక్

GoAir ఉద్యోగులకు షాక్

కరోనా మహమ్మారి వల్ల విమానయాన ఆదాయాలపై తీవ్ర ప్రభావం పడిందని, దీంతో తమ ఉద్యోగుల మార్చి వేతనంలో కోత ఉంటుందని గోఎయిర్ సీఈవో వినయ్ దుబే వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించి చేయడానికి తమకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం పంపించారు.

తక్కువ వేతనం ఇచ్చే వారిపై తక్కువ ప్రభావం పడేలా చూస్తామని కూడా వినయ్ దుబె వెల్లడించారు. అప్పటికే వేతనం తక్కువ ఉంటుంది కాబట్టి వారి వేతనంలో సాధ్యమైనంత తక్కువ కట్టింగ్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.14 సంవత్సరాల గోఎయిర్ చరిత్రలో ఎప్పుడు కూడా వేతనాలు తగ్గించలేదని వినయ్ దుబే ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పరిస్థితులు చక్కబడ్డాక మీ త్యాగానికి ఫలితంగా కాంపన్సేట్ ప్రయత్నాలు చేస్తామన్నారు.

తాము మార్చి నెలలో 24 రోజులు పని చేశామని, ఇలాంటప్పుడు తమ వేతనాలు ఎలా కట్ చేస్తారని ఉద్యోగుల ప్రశ్న. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వేతన కోత అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, నగదును కాపాడుకునేందుకు చేసే పని అని చెబుతున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో ఇదో ఆప్షన్ అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఉద్యోగుల వేతనాలు చెల్లించలేకపోతున్నామని, కనీసం 50 శాతం మంది ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అర్జెంట్ ఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు. రానున్న మూడు నెలలు ఈ పరిస్థితి దారుణంగా ఉండేలా ఉందని, ఈ మేరకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. కాగా, అంతకుముందు ఇండిగో, ఎయిరిండియా కూడా వేతనాల్లో కోత విధించింది.

Back to Top