రూ.1.70లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నిర్మలా సీతారామన్
- March 26, 2020
ఢిల్లీ:కరోనా వలన కోట్లమంది జీవనోపాధిపై చావుదెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయాయి.భారత కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొన్ని ఉద్దీపనలు ప్రకటిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా ఆర్థిక మంత్రి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా లక్షా 70 వేల కోట్ల రూపాయల ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజిని ప్రకటించారు. రెండురోజుల క్రితమే ఆర్థికమంత్రి మీడియా భేటీ నిర్వహించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంచారు. జూన్ 30, 2020 వరకూ ఈ గడువు పెంచారు. పన్ను చెల్లింపుల ఆలస్య రుసుమును 12 నుంచి 9 శాతానికి తగ్గించారు, ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు తుదిదశకు చేరిందన్నారు. జీఎస్టీ రిటర్నుల దాఖలుకు సంబంధించి జూన్ 30 వరకూ గడువు విధించారు.పన్ను వివాదాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుము ఉండదన్నారు. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం గడువును కూడా జూన్ 30 వరకూ పెంచారు.
ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారని భావించారు. ఆ ప్రకటన తర్వాత రెండురోజులకు ఆర్థికమంత్రి స్పందించారు. తాజాగా లాక్ డౌన్ కారణంగా నష్టపోతుున్న చిన్న మరియు అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్థిక మంత్రి ప్యాకేజీలో ముఖ్యాంశాలు *గరీబ్ కళ్యాణ్ స్కీం కింద లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ*80 కోట్ల మందికి పీఎం అన్నా యోజన పథకం వర్తింపు*శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్ సిబ్బంది, వైద్యులు, నర్సులకు 15 లక్షల చొప్సున బీమా సదుపాయం. * ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తాం..ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం*పేదవాళ్లలో ఒక్కరూ కూడా ఆహారం లేకుండా ఉండే పరిస్థితి రానీయం*రానున్న 3 నెలలకు ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం పంపిణీ*బియ్యం, గోధుమలో ఏదికావాలన్నా అందిస్తాం*ఇప్పటికే ఇస్తున్న 5 కేజీలను అదనంగా మరో 5 కేజీలు అందిస్తాం*కుటుంబానికి కిలో చొప్పున పప్పులు అందిస్తాం*రానున్న 3 నెలలకు కావాల్సిన రేషన్‌ను 2 వాయిదాల్లో తీసుకోవచ్చు*ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ*నగదు బదిలీ, ఆహార భద్రత అంశాలపై ప్రధానంగా దృష్టి* శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా*కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు*నగదు బదిలీ, ఆహార భద్రత ఈ రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి*ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ*శానిటేషన్ వర్కర్లు, ఆశా, పారామెడికల్, వైద్యులు, నర్సులకు ప్రత్యేక బీమా*ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున బీమా*కరోనాపై పోరాటంలో కలిసి వచ్చేవారికి భద్రత కల్పించేలా చర్యలు* ఆహార అవసరాలు, రోజువారీ అవసరాలకు సాయంగా ఆర్థిక ప్యాకేజీ.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







