నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్
- March 27, 2020
రోటీ కపడా ఔర్ మకాన్ అంటే... ఆహారం, దుస్తులు, తల దాచుకోవడానికి ఓ గూడు (ఇల్లు)... హాయిగా జీవితం సాగించడానికి మనుషులకు కావాల్సినవి. ఇల్లు, దుస్తులు ఉన్నప్పటికీ... కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సరైన ఆహారం దొరకక కొంతమంది కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద మనసుతో అటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







