రిక్రూట్మెంట్ ఫెయిర్లో 5000 ఉద్యోగాలు
- January 25, 2016
యూఏఈ జాతీయుల కోసం 'తాదీఫ్' రిక్రూట్మెంట్ ఫెయిర్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభభం కానుంది. అబుదాబీ నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ రిక్రూట్మెంట్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్లో సుమారు 5000 పైగా ఉద్యోగాల కోసం వివిధ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ రిక్రూట్మెంట్ ఫెయిర్లో ఔత్సాహికులు తెలుసుకోవచ్చు. కేవలం, ఉద్యోగాల కల్పన మాత్రమే కాకుండా, యువతకు కెరీర్ గైడెన్స్ విషయంలో ఈ రిక్రూట్మెంట్ ఫెయిర్ ఎంతో ఉపకరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అబుదాబీ ఎయిర్పోర్ట్స్ కంపెనీ, నేసనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్, అబుదాబీ టెర్మినల్స్, చాల్హోబ్ గ్రూప్, అడ్నాక్ మరియు యూఏఈ ఎక్స్ఛేంజ్ తదితర సంస్థలు ఉద్యోగాల్ని ఆఫర్ చేస్తున్నాయి. 2015లో నిర్వహించిన రిక్రూట్మెంట్ ఫెయిర్ని 12000 మంది యూఏఈ జాబ్ సీజకర్స్ సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. డిఫెన్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఓటూరిజం, హాస్పిటాలిటీ, టెలికాం రంగాల్లో ఉద్యోగాలు ఔత్సాహికుల కోసం ఎదురుచూస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







