5 నిమిషాల్లోనే కరోనాను గుర్తిస్తుంది...
- March 28, 2020
కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసులు ఆరు లక్షలు దాటిపోయాయి. కరోనా కేసులు పెరిగిపోతుంటడంతో ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక్కటే చెప్పింది. టెస్ట్ టెస్ట్ టెస్ట్. కరోనా వైరస్ ను తరిమికొట్టాలి అంటే కరోనా టెస్ట్ లు చేయాలని, టెస్టులు చేస్తేనే కరోనా నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు.
కరోనా వైరస్ శరీరంలో ఉంటె దానిని కనుగొనడానికి కనీసం 14 రోజుల సమయం పడుతుంది. 14 రోజుల తరువాత ఈ వైరస్ బయట పడుతున్నది. ఈలోగా ఈ వైరస్ మరింతమందికి వ్యాప్తి చెందుతున్నది. కరోనా వైరస్ ను వీలైనంత త్వరగా గుర్తించగలిగితే దాని వ్యాప్తిని అడ్డుకోవచ్చు. కరోనా వైరస్ ను శరీరంలో ఉన్నదా లేదా అని ఐదు నిమిషాల్లో గుర్తించే పరికరాన్ని అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరీస్ సంస్థ తయారు చేసింది. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా అనుమతి ఇచ్చింది. అయితే, పూర్తి స్థాయిలో దీనిపై పరిశోధనలు జరగాల్సి ఉన్నా, అత్యవసరం దృష్ట్యా వచ్చే వారం నుంచి ఈ కిట్ ను ఉత్పత్తి చేయబోతున్నారు. మాలిక్యులర్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ గా పిలిచే ఈ కిట్ పరీక్షలు సక్సెస్ అయితే, కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ఓ అడుగు ముందుకు పడినట్టు అవుతుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







