బహ్రెయిన్ : ఆనారోగ్యంతో ప్రవాస భారతీయుడి ఆత్మహత్య
- March 28, 2020
బహ్రెయిన్ లో ప్రవాస భారతీయుడు తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కేరళాలోని కోజికోడ్ జిల్లాకు చెందిన కొయిలండి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేరళాకు చెందిన రఘునందన్ కునియిల్ క్యాండీ గత 25 ఏళ్లుగా ముహరఖ్ లోని ఓ ప్రైవట్ కంపెనీలో ఎలక్ట్రిషియన్, ప్లంబర్ గా పని చేస్తున్నాడు. అతనికి ఓ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రఘునందన్ మృతదేహాన్ని అతను ఉంటున్న ఇంట్లోనే గుర్తించారు. సంఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ తో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా తన ఆరోగ్యం బాగోలేదని, సరైన ఆహారం, నిద్ర లేక అనారోగ్యం పాలైనట్లు, మతిమరుపు కూడా వచ్చినట్లు సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ప్రస్తుతం రఘునందన్ మృతదేహం ముహరఖ్ లోని కింగ్ హమద్ యూనివర్సిటీ హస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. అయితే..కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతని కుటుంబం రఘునందన్ చివరిచూపునకు కూడా నోచుకునే అవకాశాలు కనిపించటం లేదు. బహ్రెయిన్ లోని సామాజిక సేవకులు సుబేయిర్ కన్నూర్, మనోజ్ వడకర, కరీం కులముల్లాతి బహ్రెయిన్ లోనే రఘునందన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగిసిన తర్వాత అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తే రఘునందన్ చితాబస్మాన్ని ఇండియాకు తరలించే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







