కరోనాని అరికట్టడానికి భారీ విరాళాన్ని ప్రకటించిన టాటా గ్రూప్..

- March 28, 2020 , by Maagulf
కరోనాని అరికట్టడానికి భారీ విరాళాన్ని ప్రకటించిన టాటా గ్రూప్..

కరోనా వైరస్ బారిన పడి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. కాగా., ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఆరు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఆ మొత్తం ప్రజలు కరోనా వైరస్ భారిన పడి చికిత్స అందుకుంటున్నారు. అలాగే ఇప్పటి వరకు కరోనా భారిన పడి 27 వేల మందికి పైగా భాదితులు తమ ప్రాణాలను విడిచిపెట్టారు. కరోనా భయంతో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో ఇక్కడ ఆర్థిక పరిస్థితి నెలకొంది.

కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వానికి టాటా గ్రూప్ ట్రస్ట్ 500 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. కరోనాకు ఎదురు పోరాటంలో తాము సైతం కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామని టాటా ట్రస్ట్‌, టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ చెప్పింది. ఆ సంస్థ తరపున రూ.500 కోట్లను కరోనా భాదితుల కొరకు ఖర్చు చేయనున్నట్లు రతన్‌ టాటా ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేము కూడా సిద్ధమే అంటూ తెలిపారు. దేశ అవసరాల కోసం, దేశాన్ని కాపాడటానికి టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంనీస్‌, టాటా ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని అయన తెలిపారు. దేశ ప్రజల కొరకు రూ.500 కోట్లను ఖర్చు పెట్టనున్నారనేది కూడా ఆయన మీడియాలో పెట్టిన పోస్ట్ లో వివరించారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు, అనేక సంస్థలు ముందుకు వస్తున్నారు.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పెరుగుతున్న కరోనా కేసులకు అవసరమైన శ్వాస సంబంధిత పరికరాలు, కరోనా నిర్ధారణ కిట్స్‌, కరోనా బాధితులకు చికిత్స అందించే సౌకర్యాలు మెరుగు పరచడానికి, హెల్త్‌ వర్కర్లు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఈ మొత్తాన్ని వినియోగిస్తామని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com