దుబాయ్ : వినియోగదారులకు ఊరట..మార్కెట్లో దోపిడిపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్

- March 29, 2020 , by Maagulf
దుబాయ్ : వినియోగదారులకు ఊరట..మార్కెట్లో దోపిడిపై ఫిర్యాదుకు హెల్ప్ లైన్

కరోనా వైరస్ నేపథ్యంలో పండ్లు, కూరగాయల ధరల నియంత్రణకు దుబాయ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఎవరైనా ధరలు పెంచి అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఏ స్టోర్ లో అయినా పండ్లు, కూరగాయలను ఎక్కువ ధరలకు అమ్మితే 600545555 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు. లేదంటే దుబాయ్ కన్సూమర్ (Dubai Consumer) పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతులు నెమ్మదించటంతో ఇదే అదనుగా వర్తకులు దోపిడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ధరల నియంత్రణకు వినియోగదారుల ప్రయోజనం దృష్ట్యా ప్రస్తుత హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com