కువైట్: ప్రజలు ఆరోగ్య శాఖ సూచనలు పాటించకపోతే కర్ఫ్యూ గంటలు పొడగింపు
- March 29, 2020
కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాల్సిందేనని కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే కర్ఫ్యూ సమయాన్ని పొడగించేందుకు కూడా వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అనస్ అల్ సలెహ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. అలాగే కర్ఫ్యూ లేని సమయాల్లోనూ ఆరోగ్య శాఖ సూచించిన అన్ని అంశాలను విధిగా పాటించాలన్నారు. లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం దేశమంతా పూర్తిగా కర్ఫ్యూ విధించేందుకు కూడా వెనుకాడబోమని అన్నారాయన.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు