రియాద్:ఉద్యోగులకు సెలవులు... అన్ని ఫ్లైట్ సర్వీసుల రద్దు కొనసాగింపు
- March 29, 2020
కరోనా కట్టడికి సౌదీ అరేబియా ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరికొద్ది రోజులు పొడగించింది. అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను రద్దు కాలాన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే అత్యవసర విభాగాలు మినహా అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో ఉద్యోగులకు సెలవులను కూడా పొడగించింది. ఈ నిబంధనలు ప్రైవేట్ సెక్టార్ కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే కింగ్ డమ్ లో బస్, టాక్సీ, ట్రైన్ సర్వీసులను ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ ఏడాది తొలి మాసం నుంచే సౌదీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తోంది. వాటికి కొనసాగింపుగానే ప్రస్తుత నిర్ణయం తీసుకుంది. ఇంతటి కఠిన నిర్ణయాల కారణంగా కరోనా మృతుల సంఖ్యను అదుపు చేయగలుగుతోంది. సౌదీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?