భారత్ లో స్టేటస్ వీడియోలు ఇక 15 సెకండ్లే

- March 30, 2020 , by Maagulf
భారత్ లో స్టేటస్ వీడియోలు ఇక 15 సెకండ్లే

ప్రముఖ సోషల్‌మీడియా మెసెంజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ స్టేటస్‌లో పెట్టుకొనే వీడియోలు ఇక నుంచి 15 సెకండ్లకు మించి నిడివి ఉండరాదని సూచించింది. ఇప్పటివరకు ౩౦ సెకండ్ల వరకు ఉన్న వీడియోల నిడివిని తాజాగా 15 సెకండ్లకు తగ్గించాలని నిర్ణయించినట్లు వాబెటాఇన్‌ఫో ట్వీట్‌ చేసింది. కరోనా నేపథ్యంలో యూజర్లు కుప్పలుతెప్పలుగా వీడియోలను స్టేటస్‌లు పెట్టుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 15 సెకండ్లకు మించి నిడివి ఉన్న వీడియోలు స్టేటస్‌లో ఇకనుంచి అప్‌లోడ్‌ కావు. వాట్సాప్‌లో పెరిగిపోయిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాట్సాప్‌ మొదలైనప్పడు స్టేటస్‌ వీడియోల నిడివి 90 సెకండ్లు ఉండేది. యూజర్లు పెరుగుతున్నాకొద్ది నిడివిని తగ్గిస్తూ వస్తున్నది. భారత్‌లో వాట్సాప్‌ యూజర్లు 40కోట్ల మంది ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com