అత్యవసర సేవల కోసం ప్రత్యేక అంబులెన్సులు:సజ్జనార్

- March 30, 2020 , by Maagulf
అత్యవసర సేవల కోసం ప్రత్యేక అంబులెన్సులు:సజ్జనార్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజల అత్యవసర సేవలకు(మెడికల్ ఎమర్జెన్సీ)కి సంబంధించి ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్., ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంగణంలో 13 అంబులెన్సులను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఐఏఎస్., మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐఏఎస్., సహకారంతో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్, ప్రైవేట్ ఆసుపత్రుల వారి సౌజన్యంతో అంబులెన్సులు ప్రారంభించినట్లు  సీపీ తెలిపారు.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఇప్పటివరకూ 656 మందికి ప్రతీరోజు కిడ్నీ డయాలసిస్ కోసం అంబులెన్స్ లను వినియోగిస్తున్నామన్నారు. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వయంగా డయాలసిస్ కోసం అప్లై చేసుకున్న పేషంట్లను ఇంటికి వెళ్లి పాసులను అందజేశారన్నారు. 
మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు, ప్రెగ్నెంట్ మహిళలు, సీనియర్ సిటిజెన్స్ కోసం, ఇతర అవసరాలకు కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9490617440, 9490617431 కు ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే  [email protected] ఈమెయిల్ చేయవచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com