అబుధాబి: కార్మికుల నిర్బంధానికి అత్యున్నత ప్రమాణాలతో వసతి ఏర్పాటు
- March 31, 2020
అబుధాబి:కరోనాపై పోరాటంలో భాగంగా అబుధాబి అనేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.ఇటీవలె విదేశాల నుంచి ప్రయాణం చేసి అబుధాబి చేరుకున్న వారి కోసం అత్యున్నత ప్రమాణాలతో నిర్బంధ ఏర్పాట్లను చేసింది. జోన్ కార్ప్ ఈ నిర్బంధ శిబిరాలను పర్యవేక్షిస్తోంది. 30 మంది కార్మికులకు ఒక శిబిరం చొప్పున మొత్తం 4,20,000 మంది కార్మికులు ఉండేలా రెసిడెన్షియల్ సిటీస్ ను సిద్ధం చేశారు. అంతేకాదు..కార్మికులు ప్రయాణించిన బస్సులను ఎప్పటికప్పుడు రసాయనాలతో (శానిటైజ్) శుభ్రపరుస్తున్నారు. కార్మికులకు తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్ధిక మండళ్లలోని పరిశ్రమలు, కంపెనీలలో పనిచేసే కార్మికుల శ్రేయస్సుకు తాము అధిక ప్రధాన్యం ఇస్తున్నామని జోన్స్ కార్ప్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ అల్ ఖదర్ అల్ అహ్మద్ అన్నారు. నిర్బంధ శిబిరాల్లో ఖచ్చితమైన ప్రమాణాలను పాటించినట్లు వెల్లడించారు. కరోనా ప్రభావంతో పారిశ్రామిక రంగం సమస్యలు ఎదుర్కొకుండా, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా తాము తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!