దుబాయ్:పారామెడికల్ సిబ్బంది పరిరక్షణ కోసం 'సెల్ఫ్ శానిటైజేషన్ వాక్' ఆవిష్కరణ

- March 31, 2020 , by Maagulf
దుబాయ్:పారామెడికల్ సిబ్బంది పరిరక్షణ కోసం 'సెల్ఫ్ శానిటైజేషన్ వాక్' ఆవిష్కరణ

దుబాయ్ ఆంబులెన్స్ కార్పోరేషన్ పారామెడికల్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు సెల్ఫ్ శానిటైజేషన్ వాక్ ను ఆవిష్కరించింది. ఓ ప్రత్యేకమైన బాక్స్ తరహలో ఉండే ఈ క్యాబిన్ ఆస్పత్రి సిబ్బంది ఎలాంటి వైరస్ దాడికి గురికాకుండా వారిని శుభ్రపరుస్తుంది. క్యాబిన్ లోని ఎంట్రీ కాగానే థర్మల్ స్క్రీనింగ్ చేసి శరీర ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఆ వెంటనే అందులోని రసాయనాలు క్యాబిన్ లోకి వెళ్లిన వ్యక్తిపై స్ప్రే చేస్తుంది. దీంతో పారామెడికల్ సిబ్బంది వేసుకున్న దుస్తులు, షూకి ఏమైన వైరస్ అంటిపెట్టుకొని ఉంటే క్షణాల్లో నాశనం చేస్తుంది. కరోనాపై పోరాటంలో భాగంగా ఆస్పత్రి సిబ్బంది కరోనా పేషెంట్లకు సేవ చేసే సమయంలో వైరస్ దాడికి గురయ్యే అవకాశాలు ఉండటంతో వారి సంరక్షణ కోసం ఈ సెల్ఫ్ శానిటైజేషన్ ను రూపొందించింది.సెల్ఫ్ శానిటేషన్ వాక్ క్యాబిన్ ద్వారా పారామెడికల్, ఇతర ఆస్పత్రి సిబ్బంది అత్యున్నత ప్రమాణాలతో కూడిన సంరక్షణ అందిస్తున్నామని దుబాయ్ ఆంబులెన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఖలీఫా అల్ద్రై తెలిపారు. కరోనాపై పోరాటంలో ముందువరుసలో ఉన్న ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య సంరక్షణ తమ బాధ్యత అని, వారి సంరక్షణ కోసం చర్యలు చేపట్టాలన్న దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూచనలకు అనుగుణంగా SFFECO గ్లోబల్ సహకారంతో సెల్ఫ్ శానిటైజేషన్ వాక్ రూపొందించామని ఆయన తెలిపారు. దీని ద్వారా వినూత్న ఆవిష్కరణలో దుబాయ్ ఆంబులెన్స్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని ఖలీఫా తెలిపారు. SFFECO గ్లోబల్ సీఈవో హదీ అల్ ఖతిబ్ మాట్లాడుతూ..24 గంటల్లోనే సెల్ఫ్ శానిటైజేషన్ వాక్ ను ఆవిష్కరించిటన్లు వెల్లడించారు. ఈ క్యాబిన్ ద్వారా కేవలం 20 సెకన్లలోనే పారామెడికల్ వేసుకున్న దుస్తులను డిసిన్ఫెక్షన్ చేస్తుందని తెలిపారు. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com