ఖతార్:కార్మికుల సమస్యలపై ఫిర్యాదులకు హాట్ లైన్ ఏర్పాటు
- April 01, 2020
దోహా:కార్మికుల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఖాతార్ కార్మిక, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ కొత్తగా హాట్ లైన్ సర్వీసును ప్రారంభించింది. 92727కి ఫోన్ చేసి తమ సమస్యలను తెలుపవచ్చని వివరించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఈ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్మికులు తమ తమ ప్రాంతీయ భాషల్లోనే ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు QID నెంబర్ ఉన్నవారైతే తమ ఫోన్ నుంచి QID నెంబర్ తర్వాత 5 అంకెను జతపర్చి టెక్ట్స్ మెసేజ్ కూడా చేయవచ్చు.
ఒక వేళ QID నెంబర్ లేనట్లైతే వీసా నెంబర్ తర్వాత 5 అంకెను జత పరిచి మెసేజ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇదిలా ఉంటే కార్మికుల రెసిడెన్సీ పర్మిట్ గడువు పెంపుపై కార్మిక మంత్రిత్వ శాఖ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారితో కార్మికుల రెసిడెన్సీ పర్మిట్ గడువు పెంచాలని నిర్ణయించింది. రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసినా అటోమెటిక్ గా రెన్యూవల్ అయ్యేలా డిసిషన్ తీసుకున్నారు. దీంతో కరోనా వైరస్ సంక్షోభం ముగిసిన తర్వాత రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా ఎలాంటి ఫైన్ చెల్లించకుండా తిరిగి ఖతార్ చేరుకోవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు