కోవిడ్‌ 19: కొత్త ఫీచర్‌ని జోడించిన ఫేస్‌బుక్‌

- April 01, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: కొత్త ఫీచర్‌ని జోడించిన ఫేస్‌బుక్‌

ఫేస్‌బుక్‌, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఓ కొత్త ఫీచర్‌ని యాడ్‌ చేసింది. కోవిడ్‌19 క్రైసిస్‌కి సంబంధించి కమ్యూనిటీ హెల్ప్‌ పీచర్‌ని యాడ్‌ చేయడంతో, ఈ ఫీచర్‌ చాలామందికి ఉపకరించే అవకాశముంది. నాలుగేళ్ళ క్రితం కమ్యూనిటీ హెల్ప్‌ ఫీచర్‌ని ఫేస్‌బుక్‌ యాడ్‌ చేసింది. నేచురల్‌ డిజాస్టర్స్‌ నేపథ్యంలో షెల్టర్‌, ఫుడ్‌ లేదా సప్లయ్స్‌ కోసం ఇబ్బంది పడుతున్నవారికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడేది. ఇప్పుడు ఈ ఫీచర్‌లోకి కోవిడ్‌ని కూడా తీసుకొచ్చింది ఫేస్‌బుక్‌. ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొద్దివారాలుగా కృషి చేస్తున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అమెరికాలో 50 కిలోమీటర్లు, ఇతదేశాల్లో 100 కిలోమీటర్ల రేడియస్‌లో వున్నవారికి ఈ ఫీచర్‌ ద్వారా సదరు ప్రాంత పరిధిలో సహాయ సహకారాలు అందుతాయి. ఏ ప్రాంతంలో అయితే సహాయం కోరుకుంటున్నారో, ఆ ప్రాంతాన్ని యూజర్స్‌ సెలక్ట్‌ చేసుకునే అవకాశం వుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com