దుబాయ్:కరోనాతో వ్యక్తి చనిపోయినట్లు పుకార్లు..వాస్తవాలను వెలుగోకి తెచ్చిన CDA

- April 01, 2020 , by Maagulf
దుబాయ్:కరోనాతో వ్యక్తి చనిపోయినట్లు పుకార్లు..వాస్తవాలను వెలుగోకి తెచ్చిన CDA

దుబాయ్:కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి దుష్ప్రచారం చేసినా సహించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నా..ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. దుబాయ్ లోనూ అలాంటి అసత్య ప్రచారమే ఈ మధ్య వైరల్ గా మారింది. కరోనా వైరస్ తో దుబాయ్ వీధిలో ఓ వ్యక్తి చనిపోయినట్లు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ అధారిటీ వాస్తవాలను వెలుగులోకి వెలుగులోకి తీసుకొచ్చింది. దుబాయ్ వీధిలో పడిన వ్యక్తి కరోనా వైరస్ చనిపోయిన వ్యక్తి వీడియో కాదని తేల్చేసింది. అతను మూర్చవ్యాధితో బాధపడుతున్నాడని, మూర్ఛరావటంతోనే అతను కిందపడిపోయినట్లు అసలు విషయాన్ని ప్రజలకు వివరించింది. కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేసిన తాము గమనిస్తూనే ఉంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఫోన్ కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియాపై నిరంతరం తమ నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సమాజ భద్రతకు హని కలిగించేలా చేసే అసత్య ప్రచారాలు యూఏఈ చట్ట ప్రకారం నేరమని, అలాంటి పుకార్లను వ్యాప్తి చేసే వారు జైలు శిక్షతో పాటు 3 మిలియన్ డాలర్ల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com