విజయవాడలో హై అలర్ట్..
- April 03, 2020
ఏ.పి:భారత దేశంలో కరోనాని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న రోజు రోజుకీ ఈ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయవాడలో 18 పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, 14 కేసులు ఢిల్లీ లింకులు అని చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఏర్పాటు అమల్లోకి తీసుకు వచ్చారు. భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేట... ఇలా మూడు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైను ఏపిలో 149 చేరిన కరోనా పాజిటీవ్ కేసులు. నిన్న ఒక్కరోజు 38 కేసులు నమోదు అయ్యాయి. గత రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న కరోనా ఏపిలో విజృంభిస్తుంది. నిన్న ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ సైతం ఏపిలో జరుగుతున్న పలు విజయాల గురించి ఆయనకు తెలియజేశారు.. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి ఏపిలో జరుగుతున్న పరిణామాల గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు.భారత దేశ వ్యాప్తంగా కరోనా పై యుద్దం చేస్తూ ఉన్నా రోజు రోజు కీ పెరిగిపోతున్న కేసులను మాత్రం అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు