కరోనా అలర్ట్‌: సెల్ఫ్ అస్సెస్‌మెంట్‌ కోసం మావిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌

- April 03, 2020 , by Maagulf
కరోనా అలర్ట్‌: సెల్ఫ్ అస్సెస్‌మెంట్‌ కోసం మావిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యాప్‌

సౌదీ హెల్త్‌ మినిస్ట్రీ, సెల్ఫ్ అస్సెస్‌మెంట్‌ ఫీచర్‌ని మావిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ ద్వారా కరోనా వైరస్‌కి సంబంధించి ఎవరికి వారు ఎస్సెస్‌మెంట్‌ చేసుకోవడానికి వీలవుతుంది. పబ్లిక్‌కి కన్సల్టేషన్‌ విండోగా ఇది ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు ఇటీవల తిరిగిన దేశాలు, వారికి వున్న సింప్టవ్స్‌ుని ఆధారంగా ప్రశ్నలు - సమాధానాలు వుంటాయి. తద్వారా ఎనలైజ్‌ అండ్‌ ఎస్సెస్‌మెంట్‌కి వీలు కలుగుతుంది. హెల్త్‌ మినిస్ట్రీ ద్వారా 500,000 మందికి కన్సల్టేషన్‌ సర్వీసెస్‌ అందించడం జరిగిందనీ, మావిడ్‌ యాప్‌ ద్వారా 250,000 మందికి సెల్స్‌ ఎస్సెస్‌మెంట్‌ టెస్టులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మావిడ్‌ ద్వారా కింగ్‌డమ్ లోని 2,400 హెల్త్‌ సెంటర్స్‌లో అపాయింట్‌మెంట్స్‌ని బుక్‌ చేసుకోవచ్చు. మావిడ్‌ సర్వీస్‌ ఉచితంగానే లభిస్తుంది. మావిడ్‌ యాప్‌లో ఎస్సెస్‌మెంట్‌ పూర్తయ్యాక, వారికి ఓ గైడెన్స్‌ కూడా అందుతుంది. ఆండ్రాయిడ్‌ అలాగే ఐఓఎస్‌ ప్లాట్‌ఫావ్స్‌ుపై ఈ యాప్‌ పనిచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com