మార్నింగ్ వాక్కు వెళ్లిన 41 మంది అరెస్ట్..
- April 04, 2020
కేరళ:భారత దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ వెసులు బాటును కొందరు దుర్వినియోగం చేసే సరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
కేరళలోని కొచ్చిలో పానంబెల్లి నగర్ ప్రాంతంలో కొంతమంది శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. లాక డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి వీరంతా ఉదయం సామూహికంగా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాలతో సర్వైలెన్స్ చేస్తుండగా గుంపులుగా వెళ్తున్న వీరు కనపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా వీరందరిని అరెస్ట్ చేసినట్లు కొచ్చి సౌత్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశారు. కేరళలో ఇప్పటివరకు 295 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన