కువైట్:సొంత దేశాలకు వెళ్లే వారికి సహాయంగా జ్లీప్ లో మరో రెండు కేంద్రాల ఏర్పాటు
- April 05, 2020
కువైట్ సరైనా వీసా, ఇతర డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘించినవారిని తమ సొంత దేశానికి తరలించే ప్రక్రియను కువైట్ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది.కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు జరిమానాలు రద్దు చేసి మరీ రెసిడెన్సీ ఉల్లంఘించినవారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఫర్వానియాలో రెండు సహాయ కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. అయితే..రెసిడెన్సీ ఉల్లంఘించినవారి కోసం తాజాగా జ్లీబ్ లో మరో రెండు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జ్లీబ్ అల్-షుయౌఖ్, రుఫైదా అల్-అస్లామియా బాలికల ప్రాధమిక పాఠశాల, 4వ బ్లాక్ 4, స్ట్రీట్ నెంబర్ 200లో మహిళల కోసం ఒక కేంద్రాన్ని, జలీబ్ అల్-షుయౌఖ్, నయీమ్ బిన్ మసౌద్ బాలుర పాఠశాల, 4వ బ్లాక్, 250వ వీధిలో మగవారికి మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఆదివారం నుంచి ఈ సహాయ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు పని చేస్తాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







