ఫ్రీ బస్సు సర్వీసులు,ట్యాక్సీ ఛార్జీల్లో మినహాయింపు ప్రకటించిన దుబాయ్

- April 05, 2020 , by Maagulf
ఫ్రీ బస్సు సర్వీసులు,ట్యాక్సీ ఛార్జీల్లో మినహాయింపు ప్రకటించిన దుబాయ్

దుబాయ్:కీలక రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అత్యవసరంగా బయటికి వచ్చిన ప్రజల కోసం ఉచితంగా బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా శాఖ ప్రకటించింది. అలాగే ట్యాక్సీల్లోనూ వెళ్లేవారికి 50 శాతం మినహాయింపు ప్రకటించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్టెరిలైజేషన్ (వైరస్ సంహరణకు రసాయనాల పిచికారి) ప్రక్రియను మరో రెండు వారాలు పొడగించిన నేపథ్యంలో మెట్రో, ట్రామ్ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసింది. దీంతో అత్యవసరంగా బయటికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రస్తుత సమయం సవాళ్లతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూచనల మేరకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీలైనంత వరకు ప్రజలకు వీలైనంత ఎక్కువ మద్దతు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com