అమెరికాలో కరోనా మారణహోమం.. ఒక్కరోజే 1100 మంది మృతి

- April 05, 2020 , by Maagulf
అమెరికాలో కరోనా మారణహోమం.. ఒక్కరోజే 1100 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు అమెరికా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం ఒక్క రోజు 1100 మంది చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత వరకు ప్రపంచంలోని ఏ దేశంలో 24 గంటల వ్యవధిలో ఇన్ని కరోనా మరణాలు సంభవించలేదు. దీంతో అమెరికన్లు బిక్కుబిక్కు మంటూ ఇండ్లలోనే గడుపుతున్నారు.

మరోవైపు అమెరికాలో కరోనాకు కేంద్ర స్థానంగా నిలిచిన న్యూయార్క్‌లో శనివారం 630 మంది మృత్యువాతపడ్డారు. అంటే ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒకరు చనిపోయినట్లే లెక్క. ఒక్క అమెరికాలోనే కాకుండా యూరోప్ దేశాలైన స్పెయిన్, ఇటలీ, బ్రిటన్‌లలో కూడా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం అమెరికాలో మాస్కులకు కూడా కొరత ఏర్పడింది. ప్రజలు బయటకు వచ్చే సమయంలో ముఖాలకు వస్త్రాలు కానీ, ఇండ్లలో తయారు చేసుకునే మాస్కులు కానీ ఉపయోగించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచిస్తున్నారు.

ప్రజలు విరివిగా మెడికల్, సర్జికల్ మాస్కులను ఉపయోగిస్తుండటంతో.. అవసరమైన వారికి, వైద్య సిబ్బందికి మాస్కులు దొరకని పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రజలు ఈ విషయంలో సహకరించాలని ఆయన కోరారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 11 లక్షల 30 వేలకు చేరుకుంది. వీరిలో 2 లక్షల 11 వేల మంది కోలుకున్నారని.. 60 వేల మందికి పైగా మరణించారని గణాంకాలు తెలుపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com