భారత్ సహాయాన్ని కోరిన అమెరికా

- April 05, 2020 , by Maagulf
భారత్ సహాయాన్ని కోరిన అమెరికా

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా ఇబ్బందులు పెడుతున్నదో చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి ప్రపంచం మొత్తం ఒక్కటై పోరాటం చేస్తున్నది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాను ఈ వైరస్ అతలాకుతలం చేస్తున్నది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా బారిన పడిన వ్యక్తుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది.

వెంటిలేటర్ల కొరత పీడిస్తోంది. పీపీఈ కొరత ఇబ్బందులు పెడుతుంది. కరోనా టెస్టింగ్ కిట్స్ లేకపోవడంతో టెస్ట్ లు చేయలేకపోతున్నారు. ఇక వైరస్ వ్యాప్తికి కొంత వరకు మలేరియాకు వినియోగించే హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ బాగా పనిచేస్తున్నది. ప్రపంచం మొత్తం ఇప్పుడు దీన్ని కరోనాకు ముందుగా వినియోగిస్తున్నారు. అమెరికాలో రోగుల సంఖ్య పెరిగిపోతుండటంతో అక్కడ హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ కొరత తీవ్రంగా ఉన్నది. దీంతో ట్రంప్ ఇండియా ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ఇండియా హైడ్రాక్సీ క్లోరో క్వినోన్ ను భారీ ఎత్తున తయారు చేస్తున్నది.

మార్చి 25 వ తేదీ నుంచి ఈ హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ ను ఎగుమతులను ఇండియా నిషేదించింది. తమ దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ కొరత విపరీతంగా ఉందని, ఆపత్కాల సమయంలో ఎగుమతి చేసి ఆదుకోవాలని ట్రంప్ భారత ప్రధాని మోడీని కోరారు. దానికి మోడీ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే రెండు దేశాలు కరోనాపై సంయుక్తంగా కలిసికట్టుగా పోరాటం చేసేందుకు సిద్ధం అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com