దీపం వెలిగించి సంఘీభావం తెలిపిన ఉపరాష్ట్రపతి
- April 05, 2020
ఢిల్లీ:కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు 130కోట్ల మంది భారతీయులు ఒకేతాటిపై ఉన్నారని చాటిచెప్పాలన్న ఉద్దేశంతో.. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఏకతాటిపైకి వచ్చి తమ దృఢ సంకల్పాన్ని ప్రదర్శించడం అభినందనీయం.
కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,సతీమణి ఉషమ్మతో కలిసి తన నివాసంలో రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు, పేదల ఆకలి తీర్చడంతోపాటు వారికి నీడ కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని మరవొద్దు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్యవార్తల ప్రచారం, వందతుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
దీప ప్రజ్వలన మనుషులను అజ్ఞానం నుంచి జ్ఞానమార్గంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి వెళ్లేందుకు మార్గదర్శనం చేస్తుంది. ఇదే స్ఫూర్తితో ఇకపైనా ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాన్ని పాటించండి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







