కరోనాపై షార్ట్ ఫిలిం... కలిసి నటిస్తున్న బిగ్ బి,సూపర్ స్టార్,మెగా స్టార్
- April 06, 2020
కరోనా వైరస్ అవుట్ బ్రేక్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భయానక పరిస్థితుల నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో వైరస్ పట్ల అవేర్‌నెస్ కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, ప్రియాంక చోప్రా, రణబీర్ కపూర్, అలియా భట్‌లతో పాటు మరికొందరు కలిసి ఓ షార్ట్ ఫిలిం ద్వారా కోవిడ్ 19పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింకు ఫ్యామిలీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ప్రసూన్ పాండే దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ స్వయంగా పూనుకొని రూపొందిస్తున్న ఈ సినిమా షార్ట్ ఫిలింలో ఇంట్లోనే ఉండటం, జాగ్రత్తలు పాటించటం, పరిశుభ్రత పాటించటం, ఇంటి నుంచే పనులు చేసుకోవటం, సోషల్ డిస్టాన్సింగ్ పాటించటం లాంటి అంశాలలో సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. వియ్ ఆర్ వన్ పేరుతో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
ఇప్పటికే సోని పిక్చర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో కలిసి అమితాబ్ దాదాపు లక్ష కుటుంబాలకు నిత్యావసరాలను అందిస్తున్నారు అమితాబ్. ఈ కార్యక్రమంపై సోనీ పిక్చర్స్ సీఈఓ ఎన్పీ సింగ్, సోని పిక్చర్స్, `కష్టకాలంలో మన మంతా సంఘటితంగా ఈ మహమ్మారిపై పోరాడాల్సిన సమయం వచ్చింది. ఈ సందర్భంగ అమితాబ్ బచ్చన్, కళ్యాణ్ జ్యువెలర్స్‌తో సినీ టీవీ రంగాల్లో పనిచేస్తున్న రోజూవారి కూలీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.`
ప్రసూన్ రూపొందిస్తున్న షార్ట్ ఫిలిం విషయానికి వస్తే.. ఈ ఫిలింను పూర్తిగా విర్చువల్ టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది సెలబ్రిటీలు స్వయంగా నటించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం ఎప్పుడు ఈ ప్లాట్ ఫాంలో ప్రదర్శిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







