దుబాయ్ స్టెరిలైజేషన్: వీళ్ళకి కూడా బయటకు వెళ్లాలంటే అనుమతి అవసరం

- April 06, 2020 , by Maagulf
దుబాయ్ స్టెరిలైజేషన్: వీళ్ళకి కూడా బయటకు వెళ్లాలంటే అనుమతి అవసరం

దుబాయ్: దుబాయ్ లో కరోనా ను అరికట్టేందుకు రెండు వారాలపాటు 24 గంటలూ స్టెరిలైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండువారాల లాక్ డౌన్ లో నిబంధనలు కూడా కఠినతరంగానే విధించారు పోలీసులు..ఇవి ఉల్లంఘించామా? అంతే సంగతి...భారీ ఫైన్ లు కట్టుకోవలసిందే.

ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్ళచ్చు కానీ దుబాయ్ పోలీసుల నుండి 'పర్మిట్' తెచ్చుకోవటం తప్పనిసరి. ఆఖరికి నడిచి/సైకిల్ మీద వెళ్లినా పర్మిట్ తప్పనిసరి అని నొక్కి చెప్తున్నారు అధికారులు. ఈ పర్మిట్ కోసం https://dxbpermit.gov.ae/permits కు లాగిన్ అవ్వాలి. ఆ వెబ్‌సైట్‌ కు లాగిన్ అయినప్పుడు, ప్రజలు ఏ రవాణా మోడ్‌ను ఉపయోగిస్తారనే దాని కోసం ఒక ఎంపికను ఎంచుకునేలా కొత్త ఎంపిక పొందుపరచబడింది అనగా ప్రజలు కారు, మెట్రో, బస్సు, నడక లేదా సైక్లింగ్ వంటి విభిన్న ఎంపికలను ఎంచుకోవచ్చు.

ప్రజలు ప్రతిరోజూ సూపర్‌మార్కెట్లు, ఫార్మసీలకు వెళ్లవద్దని, బదులుగా రెండు, మూడు రోజుల పాటు తగినంత ఆహారం మరియు ఔషధాలు కలిగి ఉండటానికి అవసరమైన వాటిని పెద్దమొత్తంలో కొనుగోలు చేయాలని పోలీసులు సూచించారు. పర్మిట్ కు అప్లై చేసేకంటే డెలివరీలను ఉపయోగించాలని అధికారి ప్రజలను కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com