కొత్త ఆన్‌లైన్‌ సర్వీసుల్ని ప్రారంభించిన కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌

- April 06, 2020 , by Maagulf
కొత్త ఆన్‌లైన్‌ సర్వీసుల్ని ప్రారంభించిన కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌

కువైట్‌:కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌ కోసం కొత్త ఆన్‌లైన్‌ సర్వీసుల్ని ప్రారంభించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ కొత్త సర్వీసులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. మినిస్ట్రీ వెబ్‌ సైట్‌ (www.moi.gov.kw) ద్వారా రెసిడెన్సీ ట్రాన్స్‌ఫర్‌ (ఓ పాస్‌పోర్ట్‌ నుంచి ఇంకో పాస్‌పోర్ట్‌ - రెసిడెంట్స్‌ కోసం), లాటిన్‌ నేమ్ మాడిఫికేషన్‌, ఫ్యామిలీ రెసిడెన్సీ రెన్యువల్‌ (ఆర్టికల్‌ 22) అలాగే స్పాన్సర్స్‌ రెసిడెన్స్‌ (ఆర్టికల్‌ 24) వంటివి పొందవచ్చు. రెసిడెన్సీ రెన్యువల్‌ సర్వీస్‌ మాత్రం, గత మార్చిలో రెసిడెన్సీ గడువు తీరినవారికి మాత్రమే లభిస్తుంది.

 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com