యూ.ఏ.ఈ :Dh35 మిలియన్ల జాక్ పాట్..లాటరీలో గెలుచుకునే ఛాన్స్
- April 07, 2020
యూ.ఏ.ఈ:ప్రతి వారం 35 మిలియన్ల దిర్హామ్స్ గెలుకునే ఛాన్స్ మీ ముందుకు తీసుకువస్తోంది యూఏఈ లాటరీ. డిజిటల్ కలెక్టబుల్స్ స్కీం ద్వారా తొలి ఫత్వా ఆమోదం కలిగిన లాటరీ స్కీంను ప్రారంభించింది. ఏప్రిల్ 18 రాత్రి ఏడున్నరకు లైవ్ స్ట్రీమ్ ద్వారా తొలి డ్రా నిర్వహించనుంది. ఎమిరాతి లోటో లాటరీలు (కలెక్టబుల్ కార్డ్స్) ప్రముఖ యూఏఈ ల్యాండ్ మార్క్ ప్రాంతాలతో పాటు ఆన్ లైన్, ఫోన్ యాప్స్ ద్వారా కొనుక్కోవచ్చు. ఒక్కో కలెక్టబుల్ కార్డు(టికెట్) ధర 35 దిర్హామ్ లుగా నిర్ణయించారు. ఈ లాటరీలో ప్రతీ వారం జాక్ పాట్ ప్రైజ్ మనీగా Dh35 మిలియన్ల నుంచి Dh50 మిలియన్ల వరకు గెలుచుకోవచ్చు. ఆన్ లైన్ డ్రా సిస్టమ్ ద్వారా నిర్వహించే ఈ లాటరీలో ఎమిరాతి లోటో వెబ్ సైట్(www.emiratesloto.com) లో గానీ, యాప్ ద్వారా గానీ ముందుగా ఆరు నెంబర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. డ్రా సమయంలో ఎంచుకున్న ఆరు నెంబర్లతో బాల్ మిషన్ లో నెంబర్లు సరిపోలితే జాక్ పాట్ తగిలినట్టే.
యూఏఈ లాటరీలో ఎంచుకున్న నెంబర్లతో బాల్ మిషన్ చూపించే నెంబర్లు ట్యాలీ అవటాన్ని బట్టి ప్రైజ్ మనీ ఆధారపడి ఉంటుంది. ఒక వేళ టికెట్ కొనుక్కున్న వ్యక్తి ఎంచుకున్న ఆరు నెంబర్లు బాల్ మిషన్ డ్రాలో మ్యాచ్ అయితే జాక్ పాట్ ప్రైజ్ మనీ Dh35 మిలియన్లు సొంతం అవుతాయి. అయితే..ఈ సొమ్మును ఎంత మంది విజేతలు ఉంటే అంతమందికి సమానంగా పంచుతారు. ఒక వేళ 5 నెంబర్లు మాత్రమే మ్యాచ్ అయితే..Dh3,50,000 క్యాష్ ప్రైజ్ దక్కుతుంది. ఇక నాలుగు నెంబర్లు మాత్రమే సరిపోలితే 300 దిర్హామ్ లు, మూడు నెంబర్లు మ్యాచ్ అయితే తర్వాత డ్రాకు ఫ్రీ ఎంట్రీ అవకాశం ఉంటుంది. అయితే..డ్రాలో పాల్గొన్న వారెవరికి ఆరు నెంబర్లు మ్యాచ్ కాకపోతే తర్వాత వారానికి జాక్ పాట్ ప్రైజ్ మని మరో 5 మిలియన్ల దిర్హామ్ లు పెరుగుతుంది. ఇలా 50 మిలియన్ల దిర్హామ్ వరకు పెంచుతూ వెళ్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?