ఫుడ్‌ ప్యాకింగ్‌పై ఫోకస్‌ పెట్టిన అసిర్‌ మునిసిపాలిటీ

ఫుడ్‌ ప్యాకింగ్‌పై ఫోకస్‌ పెట్టిన అసిర్‌ మునిసిపాలిటీ

సౌదీ అరేబియాకి చెందిన అసిర్‌ మునిసిపాలిటీ, తమ ప్రాంతంలోని రెస్టారెంట్స్‌ ఫుడ్‌ ప్యాకింగ్‌ విషయంలో భద్రత పరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, భద్రతతో కూడిన పరిశుభ్రమైన ప్యాకింగ్‌ని వినియోగదారులకు అందించాలని అసిర్‌ మునిసిపాలిటీ, రెస్టారెంట్లకు సూచించింది. కరోనా వైరస్‌ తీవ్రత నేపత్యంలో వృద్ధులకు అలాగే డిసేబిలిటీతో బాధపడుతున్నవారి కోసం ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోపక్క, సౌదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అథారిటీ, హెల్త్‌ అవేర్‌నెస్‌ని పెంచే క్రమంలో ఇంటరాక్టివ్‌ కమ్యూనికేషన్‌ని ప్రారంభించింది. వాట్సాప్‌ ఛాట్‌బోట్‌ వంటివి ఇందులో వున్నాయి. ప్రస్తుతం 2463 కరోనా పాజిటివ్‌ కేసులు కింగ్‌డమ్లో వున్నాయి. వీరిలో 488 మంది రికవర్‌ అవగా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Back to Top